
రాజోలు: మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి సందర్భంగా మలికిపురం గ్రామంలోని అంబేద్కర్–పూలే భవనం వద్ద ఉన్న పూలే విగ్రహానికి రాజోలు నియోజకవర్గ శాసన సభ్యులు దేవ వరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలు తొలగించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన విద్యా హక్కు ఉండాలనే ఆయన ఆశయం సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ఆయన చేపట్టిన సంస్కరణలు భారత సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని చెప్పారు.
అలాగే సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పూలే దంపతుల ఆశయాలను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఫూలే–అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా ఫూలే సేవలను స్మరించుకున్నారు.