మదనపల్లిలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

మదనపల్లి: నీరుగొట్టిపల్లెలో సామాజిక ఉద్యమకారుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఉమ్మడి అన్నమయ్య&చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ, మదనపల్లి ఏఎంసి చైర్మన్ శివరాం, ఎం.ఆర్.పి.ఎస్ నరేంద్రతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఫూలే సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.