
రాజోలు: సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. రూ.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ క్లినిక్కు గౌరవ శాసన సభ్యుడు దేవ వరప్రసాద్ భూమిపూజ నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.