గురువుకు ఘన వీడ్కోలు: హీరాపురంలో పోలయ్యకు ఘన సన్మానం

పాతపట్నం నియోజకవర్గం: హీరాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మీపురం పోలయ్య పదవీ విరమణ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మండలంలోని తూముకొండ రామచంద్రపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన పోలయ్య మార్చి 31న పదవీ విరమణ పొందారు.

ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్వగ్రామం హీరాపురంలో గ్రామస్తులు కలిసి దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ పోలయ్య అందించిన విద్యా సేవలను, క్రమశిక్షణతో కూడిన బోధనను ప్రశంసించారు. అనేక మంది విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పి మంచి భవిష్యత్తుకు దారితీశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం కృష్ణారావు, కుర్మ నాయకులు, ఈశ్వరరావు, రామారావు, బాబురావు, జాడుపల్లి పాపారావు తదితరులు, గ్రామ ప్రజలు మరియు యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.