ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం- పి4

  1. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ కృషి
  2. జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-ఫోర్ కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం భీమవరం త్యాగరాజ్ భవన్‌లో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పి-ఫోర్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే విప్లవాత్మక చర్యగా అభివర్ణించారు. సమాజంలోని అట్టడుగు, మధ్య తరగతి పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఆర్థిక అసమానతలను తగ్గించి బలహీన వర్గాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించబడగా, వాటిలో 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలిపారు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారని పేర్కొన్నారు. ఎన్నారైలు కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయని, పి-ఫోర్ కార్యక్రమంలో వినియోగించే ప్రతి రూపాయికి సమగ్ర రికార్డులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులను సూచించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుచూపుతో ఈ పి-ఫోర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పింఛన్లు, తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాలతో పాటు మార్గదర్శకుల సహకారంతో పేదలకు మరింత చేయూత అందుతోందన్నారు. జిల్లాలో మరింత మంది మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు.

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా పి-ఫోర్ కార్యక్రమం కీలకమని తెలిపారు. ఒక వ్యక్తి మరొకరికి చేసే ఆర్థిక సహాయం మొత్తం ఈ కార్యక్రమంలో భాగమేనని పేర్కొన్నారు.

ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, అట్టడుగు మరియు మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఎన్ఆర్ఐలు, దాతలు ముందుకు వచ్చి భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఏఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ, పి-ఫోర్ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుందని, పారిశ్రామికవేత్తలు, దాతలు ముందుకు వచ్చి పేద విద్యార్థులకు సహాయం అందించాలని సూచించారు.

జిల్లాలో మార్గదర్శకులకు సన్మానం

పి-ఫర్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్గదర్శిగా ముందుకు పలువురిని ఈ కార్యక్రమంలో సన్మానించారు. వీరిలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కాళ్ల మండలం ప్రాతళ్ళ మెరకకు చెందిన వేగిరాజు శివ వర్మ, ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన దాతల సత్యనారాయణ రాజు, తాడేపల్లిగూడెం అరుగోలను గ్రామానికి చెందిన ఉప్పలపాటి వర వెంకట సత్యనారాయణ లను జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, జిల్లా స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా చేనేత జౌలిశాఖ అధికారి ఎ.అప్పారావు, భీమవరం ఏఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, తాడేపల్లిగూడెం జెడ్ పి టి సి ముత్యాల ఆంజనేయలు, మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మార్గదర్శకులు గ్రంధి సురేష్, ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.