• గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో ఎక్కడా వాలంటీర్ అనే పేరు ఉండదు
• వాలంటీరు వ్యవస్థకు చట్టబద్ధత కల్పిం చడంలోనూ జగనన్న మోసం
• వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రైవేటు ఏజెన్సీకి అనుచిత లబ్ధి
• వాలంటీర్ల ద్వారా సేకరిం చిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకి వెళ్తోం ది?
• వాలంటీర్ వ్యవస్థ లోపాలను ప్రశ్నిం చిన శ్రీ పవన్ కళ్యా ణ్ పై కేసులు పెట్టారు
• వాలంటీర్లను జగన్ వంచిస్తు న్నారు
• జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం లో పక్కదారి పట్టిన సొమ్ములు, దా ని వెనుకున్న వ్యక్తు లపై విచారణ చేస్తాం
• తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘ప్రజలకు సులభతరమైన సేవ పేరుతో వాలంటీర్లను భారీగా ఏర్పాటు చేశామని చెబుతున్న వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదు. వారున్నారా.. లేరా..? అనే దానిపై స్పష్టత లేదు. మరి వారికిస్తున్న గౌరవ వేతనం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది..? ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ.617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారు ..? అసలు వీరంతా ఎవరు .. ఎక్కడున్నారు ..?” అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మ న్ శ్రీ నా దెం డ్ల మనోహర్ గారు ప్రశ్నిం చారు . ప్రతి ఏటా డేటా నమోదు కాని వాలంటీర్ల కోసం చెల్లిస్తు న్న గౌరవ వేతనం మొత్తం రూ.617 కోట్లు … అంటే నెలకు రూ.51 కోట్లు అన్నారు . డేటా లేని వాలంటీర్లకు ఏ పద్ధతిలో గౌరవ వేతనా లు ఇస్తు న్నా రో, ఎవరికి ఇస్తు న్నా రో బయటపెట్టాలని డిమాం డ్ చేశారు . వాలంటీర్ల పేరు తో జరు గుతున్న భారీ అవినీ తిలో ఎవరి పాత్ర ఏమి టో ప్రజల ముం దు పెట్టాలన్నారు . తెనాలి లో సోమవారం ఆయన విలేకరు ల సమావేశం నిర్వ హిం చారు . ఈ సందర్భం గా శ్రీ నా దెం డ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘వాలంటీర్ల డేటా లేని టా ప్ 5 జిల్లాల వివరాలు చూస్తే తూర్పు గోదా వరి 19,366, గుం టూరు 13,066, కృష్ణా 11,725, చిత్తూరు 11,400, విశాఖపట్నం జిల్లాలో 10,586 మంది వాలంటీర్ల డేటా ఇప్పటి కీ కనిపిం చడం లేదు. అసలు వాలంటీర్లు ఎవరికి రిపోర్టు చేయాలి ..? వీరికి సంబంధిం చిన అధి కారి ఎవరు అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలి .
• వాలంటీర్ల వ్యవస్థ లోపాలపై శ్రీ పవన్ కళ్యా ణ్ ప్రశ్నిం చారు
వాలంటీర్లు, వాలంటీర్ల వ్యవస్థపై శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ఎప్పు డూ తప్పు గా మాట్లాడలేదు. వారి ఆత్మ గౌరవాన్ని దె బ్బ తీసేలా వ్యా ఖ్యానిం చలేదు. వారాహి విజయ యాత్రలో శ్రీ పవన్ కళ్యా ణ్ గారు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం సేకరిస్తు న్న సమాచారం, వ్యవస్థ పని తీరు పైన సూటి గా మూడు ప్రశ్నలు సంధిం చారు . వాలంటీర్ల వ్యవస్థకు అధి పతి ఎవరు .. వీరు ఎవరి ఆధ్వ ర్యం లో పని చేస్తు న్నారు ..? వాలంటీర్లు సేకరిస్తు న్న ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడకు వెళ్తోం ది.. ఎవరికి పంపు తున్నారు .. ఎక్కడ భద్రపరుస్తు న్నారు ..? ప్రజల వద్ద నుం చి సమాచారం సేకరిం చడానికి వాలంటీర్లకు అధి కారం ఎవరిచ్ చారు ..? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు బదులురాలేదు. వాలంటీర్లను శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ఏదో అన్నట్లు , కిం చపరి చేలా మాట్లాడినట్లు వైసీపీ అధినా యకుడితో సహా వైసీపీ నా యకులంతా శ్రీ పవన్ కళ్యా ణ్ గారి మాటలను వక్రీకరిం చారు . ప్రభుత్వం వాలంటీర్లను భయపెట్టి, బలవంతంగా, కుట్రపూరి తంగా వారి ద్వారా జనసేనా నిపై కేసులు నమోదు చేయిస్తే సత్యం మరు గునపడిపోదు. దీనిపై న్యా యపోరాటం చేస్తాం . 2023, జులైలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి న వాలంటీర్ల వ్యవస్థపై శ్రీ పవన్ కళ్యా ణ్ గారు మాట్లాడారు . జనసేన ఏ విషయం మీద మాట్లాడినా ఒకటికి రెం డుసా ర్లు చెక్ చేసుకున్న తర్ వాత, సమాచారం అంతా వాస్తవం అని తేలి న తర్ వాత మాత్రమే మాట్లాడారు . మేం ప్రజల ముం దు మాట్లాడే ప్రతి విషయం సత్యం . పూర్ తి ఆధారాలతోనే ప్రభుత్ వాన్ని ప్రశ్ని స్తాం . వాలంటీర్ల విషయంలోనూ ప్రభుత్వ తీరు ను మరోసారి ఆధారాలతో మాట్లాడుతున్నాం .
• వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా ..?
సచివాలయాల విషయంలో ప్రభుత్వం 2023 లో తీసుకొచ్చి న గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో వాలంటీర్ల వ్యవస్థకు చట్టపరమైన ఎలాంటి అనుమతి లేదు. ఈ చట్టం మొత్తం మీద వాలంటీర్లకు సంబంధిం చి ఒక్క పదం కూడా చేర్చ లేదు. చట్టం వచ్చి న తర్ వాతే సచివాలయ వ్యవస్థపై ఓ ప్రత్యే క శాఖను ఏర్పా టు చేశారు . 2023లో సచివాలయాల చట్టం తీసుకొచ్చి , అది 2019 నుం చి వర్ తిస్తుం దని అడ్డగోలుగా దా నిలోనే సవరణ చేశారు . కనీ సం ఈ చట్టంలో ఎక్కడా పేర్కొ నబడని వాలంటీర్ల వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఎక్కడుం ది..?