
కాకినాడ: రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, పెట్రోల్ కొరత నేపథ్యంలో మంగళవారం కాకినాడ నగరంలోని జీజీహెచ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌ను ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు పెట్రోల్ బంక్‌లను ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
ఇంధన నిల్వలు, సరఫరా స్థితి, వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. బంక్ నిర్వాహకులతో మాట్లాడిన ఎంపీ, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే కొరత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనవసర నిల్వలు చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఆయన, అవసరమైన చోట వెంటనే సరఫరా పెంచేలా చూడాలని కోరారు. వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు.