మన కూటమి అధికారంలోకి వస్తోంది

• పార్టీ కోసం పని చేసిన వారందరికీ సము చిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటాను
• వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు…. రాష్ట్ర అభివృద్ధి , పార్టీ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటాను
• ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు … మన కూటమి అధికారంలోకి వస్తోంది అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు . క్షేత్ర స్థాయి నుంచి మన బలాన్ని సద్వి నియోగపరచుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకువెళ్ళేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అన్నారు . వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమష్టి గెలుపు కోసమే తొలి నుంచీ నావ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు . ఆదివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తొలుత మర్యాదపూర్వకంగా పార్టీ నాయకులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఇంటికి వెళ్లారు . దాదాపు గంటపాటు వారిద్దరూ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల్లో అనుసరించే విధానాలపై చర్చించారు . అనంతరం విశాఖపట్నం , అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు . ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు పాల్గొన్నారు . సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లా నాయకులతో ముఖాముఖీ భేటీలు నిర్వహించారు . వీర మహిళ విభాగం ప్రాంతీయ సమన్వ యకర్తలతో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకులతో పలు విషయాలు పంచుకున్నారు . జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరి కీసము చిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు . 2019 తరవాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటానని చెప్పారు . ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తరవాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలి గాను… అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ – జనసేన కోసం నిలిచిన ఎవర్నీ విస్మరించేది లేదు అన్నారు . ఇప్పటి ఎన్నికల్లో స్థానా లు మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు . స్థానిక ఎన్నికల్లో కావచ్చు , పి.ఏ.సి.ఎస్.ల్లో , ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముం దుకు వెళ్దామని తెలి పారు . మూడిం ట ఒక వంతు పదవులు దక్కిం చుకుందాం అన్నారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట ్రానికి సుస్థి ర పాలన అవసరమని, అప్పు డే అభివృద్ధి సా ధ్యమనీ .. అలాంటి సుస్థి ర పాలన మన కూటమి అందిం చగలదని ఆర్థి క నిపు ణులు, పారి శ్రామి కవేత్తలు స్పష్టంగా చెపు తున్నా రని తెలి పారు . ఇటీవల తనను కలి సిన పారి శ్రామి కవేత్తలు చెప్పి న విషయాలను పంచుకున్నారు.
• పార్టీ నిధికి రూ.10 కోట్లు అందించనున్న శ్రీ పవన్ కళ్యాణ్
కూటమి నిర్ణయం అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనా లను, సమగ్ర అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకొని చేసిం దేనని చెప్పారు . వ్యక్తిగతంగా నా ప్రయోజనా ల కోసం నిర్ణయాలు తీసుకోను… సమష్టిగా నిలి చే విధంగా ప్రణాళికాబద్ధం గా అడుగులు వేస్తా ను అన్నారు . పార్టీ బలోపేతం… పార్టీ పక్షాన ఎన్ని కల నిర్వ హణ కోసం రూ.10 కోట్లు తన స్వార్ జితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.