రాజీనామాకు మమత నో.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక దశ ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను గవర్నర్‌కు సమర్పించడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్‌కు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించే మార్గం సులభమైంది.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచింది. అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘కొత్త అసెంబ్లీ ఏర్పాటు’ నోటిఫికేషన్ పరిస్థితులను వేగంగా మార్చింది. మే 9న కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేసింది. అమిత్ షా పర్యవేక్షణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంబంధించిన చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.