
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన కుమార్తె జనని త్వరలో వివాహం చేసుకోనుండగా, సూర్య తేజతో ఆమె నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిశ్చితార్థానికి హాజరైన అతిథులందరికీ బండ్ల గణేష్ విలువైన రిటర్న్ గిఫ్ట్స్ అందించినట్లు సమాచారం. “బర్గనర్” అనే ఆస్ట్రియన్ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేక బిర్యానీ హండీలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
గిఫ్ట్ బాక్స్‌లో స్వీట్ బాక్స్, బ్లౌజ్ పీస్‌తో పాటు సుమారు 5 కిలోల సామర్థ్యం గల బిర్యానీ హండి ఉన్నట్లు సమాచారం. మొత్తం కిచెన్ వేర్ సెట్ విలువ దాదాపు రూ.5,000 వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంగేజ్‌మెంట్‌కే ఈ స్థాయి బహుమతులు ఇస్తే, పెళ్లి వేడుక ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాబోయే అల్లుడు సూర్య తేజ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చెందినదని సమాచారం. అతని వ్యక్తిగత వృత్తి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.