125 రోజుల ఉపాధితో గ్రామీణ కుటుంబాలకు భరోసా

గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన VBG–RAM–G (వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు అజీవికా మిషన్–గ్రామీణ్) పథకం జూలై నెల నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు సవర రామూర్తి మాట్లాడుతూ, గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించే ఈ పథకం గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందని అన్నారు. ఉపాధి అవకాశాల పెంపుతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌జీఈఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సవర సూర్యారావులక్ష్మిపురం శాంతరావు, కూటమి నాయకులు రాజు, కిరణ్, శ్రీనుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.