
కరెంట్ షాక్‌తో మృతి చెందిన జనసేన సానుభూతిపరుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం
వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం, అగ్నిగుండాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ సానుభూతిపరుడు మద్దిరాల పిచ్చయ్య కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక నాయకులతో కలిసి పిచ్చయ్య నివాసానికి చేరుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమనంగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు మాట్లాడుతూ, కష్టసమయంలో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి మానవత్వానికి, సేవా దృక్పథానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.