కిడ్నీ బాధితుడికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

కోనసీమ : రెండు కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చికిత్స పొందుతున్న బోడసకుర్రు గ్రామ పంచాయతీ పరిధికి చెందిన కుడుపూడి మహేష్కు బుధవారం రూ.10 వేల పింఛన్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా రూ.10 వేల పింఛన్ అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సహాయం డయాలసిస్ చికిత్స, మందులు మరియు ఇతర వైద్య ఖర్చులకు బాధితులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నారాయణమూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అరవ చంటి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అడప శ్రీను, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు రోళ్ళ శ్రీనురొక్కాల నాగేశ్వరరావుదొమ్మేటి రాధాకృష్ణఓలేటి పరమేశ్వరరావుమొయిల గణపతికొడమంచిలి రామకృష్ణదొమ్మేటి రాజుమట్టపర్తి శ్రీనుజల్లి రాధాకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ చిట్టిబాబుజల్లి నాగేంద్రస్వామితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.