
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సోమవారం ఉదయం ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తమిళనాడులో హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఈ దర్శనం ప్రాధాన్యం సంతరించుకుంది. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తుండటంతో, ఆయన విజయం కోసమే త్రిష ప్రార్థనలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే, సోమవారం త్రిష పుట్టినరోజు కావడం కూడా ఈ పర్యటనకు ప్రత్యేకతను తెచ్చింది. ఆదివారం రాత్రే తాను తిరుపతికి వెళ్తున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఎన్నికల ఫలితాల ముందు జరిగిన ఈ దర్శనం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.