ఆర్ బి చౌదరి మృతి పట్ల పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్ బి చౌదరి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌదరి మృతి చెందారన్న వార్తను నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

తాను నటించిన “సుస్వాగతం” చిత్రాన్ని చౌదరి నిర్మించారని గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం ఘన విజయం సాధించిందని చెప్పారు. చిత్ర నిర్మాణం మరియు సంబంధిత వ్యాపారంపై చౌదరికి విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసి, మంచి సంగీతంతో చిత్రాలను నిర్మించడంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు.

“అన్నవరం” చిత్రంలోని సోదర సంబంధ భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయని గుర్తుచేశారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా చౌదరి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. చివరగా, చౌదరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.