‘పెద్ది’కి పవన్ దీవెనలు.. చరణ్ విజయానికి ఆంజనేయుడి ఆశీస్సులు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చిత్ర బృందానికి, రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో గ్లింప్స్‌లో రామ్ చరణ్ పేరులోని ఆధ్యాత్మికతను ప్రస్తావించింది. “రామ్ చరణ్ అనే పేరు కేవలం ఒక పేరు మాత్రమే కాదు. అది భగవంతుడు శ్రీరాముడి పాదపద్మాలతో భక్తి, శరణాగతికి ప్రతీకగా నిలిచే పవిత్ర నామం. భక్తి, శక్తి, సమర్పణకు ప్రతిరూపమైన ఆంజనేయ స్వామితో ముడిపడి ఉన్న పేరు” అని పేర్కొంది.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ‘పెద్ది’ చిత్ర నిర్మాణంలో ఎదురైన అన్ని ఆటంకాలు తొలగిపోయి, సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను ఈ చిత్రం సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ‘జై భజరంగ్ బలి’ అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.

జూన్ 3 నుంచి ప్రీమియర్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ‘పెద్ది’పై భారీ ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.