


రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లెలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌కు జనసేన రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయనకు ఆత్మీయంగా స్వాగతం అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇన్చార్జ్ పోతుల సాయినాథ్, బీసీ నాయకుడు బండి మనోహర్, రాష్ట్ర చేనేత నాయకుడు రామ్మోహన్, మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, జిల్లా జాయింట్ సెక్రటరీ గజల్ రెడ్డప్పతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.