
అమలాపురం : జనుపల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, ఎంపీ హరీష్ బాలయోగి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, వాకపల్లి నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.