
కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవలను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సేవను రెగ్యులర్ రైలుగా కొనసాగించాలని ఎంపీ పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరగా, ఆయన ఆమోదం తెలిపినట్లు తెలిపారు.
ఈ రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుంచి బయలుదేరి చర్లపల్లి, బాసర, అజ్మీర్ మార్గంగా హిసార్ జంక్షన్‌కు చేరుకుంటుంది.
ఈ సేవ ద్వారా బాసర, అజ్మీర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నేరుగా చేరుకునే సౌకర్యం లభించనుంది. దీంతో భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది.
ప్రజలు ఈ రైలు సేవను వినియోగించుకోవాలని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు.