హనుమాన్ జయంతి స్పెషల్: జనసేన 175 ఇంచార్జ్‌ల ప్రకటన

మంగళగిరి: హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కీలక సంస్థాగత నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇంచార్జ్‌లను ప్రకటించే ప్రక్రియ ఈరోజు జరగనుంది. ఇందులో భాగంగా పూర్తి జాబితా లేదా తొలి దశ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

అలాగే, అన్ని జిల్లాలకు మరియు పార్లమెంట్ స్థానాలకు అధ్యక్షులు, ఇంచార్జ్‌లను నియమించనున్నట్లు సమాచారం. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ ప్రక్రియ పూర్తైన తరువాత మండల స్థాయిలో కూడా అధ్యక్షుల నియామకాలు చేపట్టనున్నారు. గ్రామస్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.

జనసేన సంస్థాగత నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.