
సర్వేపల్లి నియోజకవర్గం: హనుమాన్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కోదండరాంపురంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలు, జనసైనికులు, కూటమి నాయకులు, వీర మహిళలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, ప్రజలకు మరింత సేవ చేసేలా దీవించాలని హనుమంతుడిని ప్రార్థించామని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా త్వరలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడ్డ వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ వెంట నిలబడి పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నీటి సంఘం టీసీ మెంబర్ పెనుబాక మహేష్, మండల అధికార ప్రతినిధి షేక్ ఖాదర్ వల్లి, షేక్ జాకీర్, మనోజ్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, పినిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.