
సంగం: సాధారణ బదిలీల్లో భాగంగా సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్‌ను జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకుడు దాడి భాను కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాల వేసి, స్వీట్లు అందజేసి నూతన బాధ్యతల స్వీకరణపై శుభాకాంక్షలు తెలిపారు. సంగం మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చల్లా రవిచంద్ర, గాంధీజనసంఘం జనసేన నాయకులు వినయ్, కృష్ణ, ప్రదీప్, నాని, ప్రభాకర్, వంగల్లు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చందు, దువ్వూరు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దద్దోల్ల వెంకటేశ్వర్లు, సంగం జనసేన నాయకులు రాపిన అనిల్, గుంజి జయరాజ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.