కోటపాలెంలో ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రారంభం..అన్నదానం

ఎచ్చెర్ల: కోటపాలెం పంచాయతీలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని భక్తుల సమక్షంలో పునఃప్రారంభించారు. ఆలయ పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా భక్తులు, గ్రామస్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో వై. లెంకపేట, మక్కపేట గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహణకు అవసరమైన బియ్యం ప్యాకెట్లను గ్రామ పెద్దలకు అందజేశారు.

ఆలయ పునఃప్రారంభం సందర్భంగా అన్నదానం నిర్వహించడం పట్ల గ్రామస్తులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గొర్లె సూర్య, సుంకర ధనంజయ, గొర్లె మోహన్, గొర్లె గౌరి, రామప్పుడు, సత్య, వినయ్, కిషోర్, జగన్, గోవిందా, రాంబాబు, మూగతరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.