
అమలాపురం: ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ద్వారపూడి రత్నం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆకేటి వెంకటేశ్వరరావు (వెంకన్న) ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్, విజయవాడకు చెందిన ఓఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు నల్ల మణికంఠ రామ్ (బాబీ), దేవి దంపతుల సహకారంతో ఆమెకు నెలరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా అందిన సహాయంపై ద్వారపూడి రత్నం స్పందిస్తూ, తమ కష్టసమయంలో అండగా నిలిచిన నల్ల మణికంఠ రామ్, దేవి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలకోటి వెంకటేష్ పాల్గొన్నారు.