
అమలాపురం ఆర్ఎంపీ–పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
అమలాపురం: అమలాపురం మండల ఆర్ఎంపీ–పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కుడుపూడి రమణ, ఉపాధ్యక్షుడిగా షేక్ వలి, కార్యదర్శిగా నాగబత్తుల బాబ్జి, ఉప కార్యదర్శిగా జయంతి సురేష్, ఖజాంచిగా గుత్తుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
సలహా కమిటీ సభ్యులుగా రెడ్డి వెంకటేశ్వరరావు, కర్రీ శేషగిరిరావు, కోటా రవికుమార్, కడలి సత్యనారాయణ, యు. విక్రమాదిత్యలను ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా ఇనుమూర్తి సత్యంను నియమించారు.
అలాగే నూతన కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుని, అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.