తూర్పుతాళ్లులో రామలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో బొమ్మిడి నాయకర్

నరసాపురం: నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సుభిక్షం కలగాలని ప్రార్థించారు.

అనంతరం ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారంగా కరింశెట్టి వెంకటేశ్వరరావు రూ.1 లక్ష విరాళాన్ని బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణతో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.