
బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ‘ఆంధ్రల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ ఇంచార్జి డా. గిరడ అప్పలస్వామి నేతృత్వంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈసారి కూడా సుమారు 100 మంది పేదలకు భోజనం అందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లంక రమేష్, పైల హరి ప్రసాద్, ఉల్లి సంతోష్ జాన్, సింబు, మౌళి, మరడన రవి, కోటేడా సురేష్ పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనసేన వీర మహిళలు రామ లక్ష్మి, లక్ష్మి, వర లక్ష్మి, గౌరీ తదితరులు కూడా పాల్గొన్నారు.