
అమలాపురం: భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల అత్యవసర సమావేశం అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ నెల 23, 24 తేదీలలో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ఆవరణలో జరగనున్న జిల్లా శిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన వసతులు, నగర అలంకరణలు, భోజన సదుపాయాలు మరియు ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి విభాగ ఇన్‌చార్జి తన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. అలాగే సంబంధిత అధికారులతో సమయానికి సంప్రదింపులు జరిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ, ఆహ్వానం అందుకున్న వారందరూ తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కోనసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి నూరు శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.