అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతిఒక్కరికీ ఆదర్శం

  1. అంబేద్కర్ ఆశయాల సాధనకు మోదీ ప్రభుత్వం కృషి
  2. ఆ మహనీయుని జయంతిని ఘనంగా నిర్వహించాలి
  3. బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి పిలుపు

అమరావతి: అమరావతిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఆయన, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను సమాజంలో బలంగా నాటిన గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు.

అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాకుండా ఆధునిక భారతానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. మహిళల హక్కులు, కార్మికుల సంక్షేమం, విద్యా విస్తరణ వంటి రంగాల్లో ఆయన చూపిన దిశ దేశాభివృద్ధికి పునాది వేసిందన్నారు.

“సమాన అవకాశాలు – సమగ్ర అభివృద్ధి” అనే లక్ష్యంతో అంబేద్కర్ విజన్ ఉన్నదని, కుల వివక్షలేని సమాజం నిర్మాణం ఆయన కలగా పేర్కొన్నారు. “శిక్షణ, సంఘటితం, ఆందోళన” అనే సందేశం యువతకు మార్గదర్శకమని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ, సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.