నేషనల్ హైవే 216ఈ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జాతీయ రహదారులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.

132 కేవీ విద్యుత్ టవర్ లైన్ పనులు వేగవంతం

నేషనల్ హైవే 216ఈ పరిధిలోని పాశర్లపూడి–దిండి ప్రాంతంలో నాలుగు చోట్ల చేపడుతున్న 132 కేవీ విద్యుత్ టవర్ లైన్ పనులను అక్టోబర్ చివరి వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. భూసంబంధిత సమస్యలను రైతులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 31లోగా చించినాడ బ్రిడ్జి పూర్తి

అమలాపురం–నరసాపురం మార్గంలోని చించినాడ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులను వేగవంతం చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.

రోడ్డు విస్తరణ పనుల్లో అలసత్వం వద్దు

అమలాపురం–రావులపాలెం నేషనల్ హైవే 216ఈ రోడ్డు విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 28లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

రోడ్డు పనులు పూర్తయ్యే వరకు ముందుగా తేలికపాటి వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, అమలాపురం ఆర్డీవో ఏ. సరళావతి, కొత్తపేట ఆర్డీవో జి.వి. సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎన్‌హెచ్‌ ఈఈ రజిని, ఎన్‌హెచ్‌ కాకినాడ డీఈ నిక్కి, జిల్లా నేషనల్ హైవే ఏఈ వెంకటరమణ, కాంట్రాక్టర్లు ఏ. అరుణ్ కుమార్, కే. శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సీహెచ్. శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.