
కొండపి: మర్రిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న జనసేన కార్యకర్త కన్నెమరకల వెంకట రమణ కుటుంబానికి చదలవాడ హరీష్ సౌజన్యంతో నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రమీల ఓరుగంటి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముప్పాళ్ల వెంకట చౌదరి, కన్నెమరకల ఆర్కే ముఖ్య అతిథులుగా పాల్గొని సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు పేదల ఆకలి తీర్చేలా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న యువనేత చదలవాడ హరీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ సామాజిక సేవలను కొనసాగించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తోడేటి నరేష్, మానం వెంకటేశ్వర్లు, పఠాన్ బాషా, చెన్నకృష్ణారెడ్డి, దండు అశోక్, జనసేన నాయకులు చిన్నా, కన్నెమరకల వెంకట రమణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.