
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ అందించిన ఆయన, కాపు సమాజ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.
కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం కాపు సమాజానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.
సంతాపం తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు జాతీయ అధ్యక్షుడు, సినీ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు, జాతీయ ప్రచార కార్యదర్శి గారపాటి నాగేశ్వరరావు (పండు బాబు), ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు ఇన్‌చార్జి నిమ్మకాయ సురేష్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా యువ కాపునాడు అధ్యక్షుడు కొప్పుల భాస్కరరావు, నాయకులు చిక్కాల రవిశంకర్, మురముల్ల శివారెడ్డి నాయుడు తదితరులు ఉన్నారు.