
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, బుర్ర బుడ్డక్క తదితర జలకలుపు మొక్కల తొలగింపు పనులను గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కాలువలోకి దిగి గుర్రపు డెక్కను తొలగించారు.
రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సరఫరా సాఫీగా జరిగేలా అధికారులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ కాలువల్లోని అడ్డంకులను తొలగిస్తున్నట్లు గుబ్బల శ్రీనివాస్ తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, డీఈఈ శ్రీరామ జనార్ధన్, కిత్తనచెరువు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు బి. వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.