భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేన: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వహించిన లేబర్ కార్డు, ఈ-శ్రమ్ భీమా కార్డు నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ సభ్యుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భీమా పథకాల ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, రణదీప్, సింహాద్రి, ప్రసాద్, గోవింద్, శివశంకర్, దుర్యోధన, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.