
భట్టిప్రోలు, జూలై 13 (వార్త): భట్టిప్రోలు మండలం గోరిగపూడి గ్రామానికి చెందిన బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థిని దూల్లిపాళ్ల వైష్టవికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌తో పాటు రూ.42,300 ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు.
వేమూరు నియోజకవర్గ జనసేన నాయకుడు చాపల వెంకట శివయ్య చేతుల మీదుగా ఈ సహాయం అందించారు. గోరిగపూడి గ్రామ జనసైనికుల సహకారంతో నగదు సేకరించి విద్యార్థినికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో భట్టిప్రోలు మండల జనసేన నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, బచ్చు పవన్‌కుమార్, ఏఎంసీ డైరెక్టర్ యర్రంశెట్టి సత్యనారాయణ, వేల్పూరి సీతయ్య, ధూళిపాళ్ల అప్పారావు, వేమూరు నియోజకవర్గ ఐటీ వింగ్ ఇన్‌చార్జి తాడికొండ మురళి, వేమూరు మండల నాయకుడు దాది సీతారామయ్య, చుండూరు మండల నాయకుడు బోడపాటి చంద్రబోస్, మంత్రి శివ కోటేశ్వరరావు, దేవిరెడ్డి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గోరిగపూడి గ్రామ జనసైనికులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.