

ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.
ఆసుపత్రికి వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్ పవన్ కళ్యాణ్‌తో ఆత్మీయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.