
అమలాపురం: సీనియర్ జర్నలిస్టు ముక్కామల చక్రధర్ సోదరి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ముక్కామల సూర్య ప్రభావతి (79) సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమెకు షుగర్ స్థాయులు పెరగడంతో తుదిశ్వాస విడిచారు.
అమలాపురం నారాయణపేటలోని ఆమె స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. యూటీఎఫ్లో దశాబ్దాల పాటు పనిచేసిన సూర్య ప్రభావతి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆమె ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా కూడా గుర్తింపు పొందారు.
మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె భౌతికకాయానికి అమలాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి దంపతులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.