నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

అమలాపురం : అమలాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో సంఘం నూతన అధ్యక్షుడిగా ర్యాలి వెంకట రమణ, ప్రధాన కార్యదర్శిగా పట్నాల సురేష్, కోశాధికారిగా కొర్లపు అనిల్, ఉపాధ్యక్షుడిగా కల్లపల్లి వెంకట రమణ, గౌరవ అధ్యక్షుడిగా కల్లపల్లి గోవిందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులుగా పసుపులేటి శ్రీనివాసు, సోమనదపల్లి రాంబాబు, పసుపులేటి రామకృష్ణ, కొరివాడ శ్రీను, గనియడ చిట్టిబాబు, ఉప్పాడ బాలులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, సంఘ అభివృద్ధితో పాటు నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యత, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమం అమలాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో ఘనంగా నిర్వహించబడింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.