మాట నిలబెట్టుకున్న పత్తి చంద్రశేఖర్.. జనసేన కార్యకర్త కుమారుడి విద్యకు రూ.25 వేల ఆర్థిక సాయం

అనంతపురం: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో విద్యాదానమే గొప్ప దానమనే భావనతో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

రెండు నెలల క్రితం పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మిట్టపల్లి ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆ సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన పత్తి చంద్రశేఖర్, ప్రసాద్ కుమారుడు ఓంకార్ విద్యాభ్యాసానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు గురువారం అనంతపురంలోని రాంనగర్ కార్యాలయంలో ఓంకార్‌ను పిలిపించి రూ.25 వేల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, జనసేన కార్యకర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ చూపిన సేవా మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు.

విద్య కోసం ఆర్థిక సహాయం అందించిన పత్తి చంద్రశేఖర్‌కు ఓంకార్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఈశ్వర్, పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు గూడ సోము, కెంపుల జనార్ధన్, తోట అనిల్ కుమార్, సూరి, మహేష్, సాయి, అరెప్పగారి హరి, శ్యాంసుందర్, నరేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.