
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశం సోమవారం రాజమండ్రిలోని లాస్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ హాజరై నూతన జిల్లా కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముమ్మన వెంకట శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల అప్పారావు, సహాధ్యక్షుడిగా రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కోఆర్డినేటర్‌గా బొబ్బాది దుర్గాప్రసాద్‌ను నియమించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు మరియు కోశాధికారులుగా పలువురిని ఎంపిక చేశారు.
రాజమండ్రి రూరల్ మండల కమిటీకి కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో APTKSS రాష్ట్ర సహాధ్యక్షుడు బడ్డుకొండ వెంకటరమణ, రాష్ట్ర కోఆర్డినేటర్ కలిశెట్టి అచ్చంనాయుడు, రాష్ట్ర కార్యదర్శి వలిరెడ్డి సత్యన్నారాయణ భవాని పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.
ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతి అభ్యున్నతి కోసం సంఘం నిరంతరం కృషి చేయాలని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకులు, సెటలైట్ సిటీ అధ్యక్షుడు యర్రా ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రుంకాని రవికుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.