
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో 25 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, కడప జిల్లాలో అదానీ గ్రూప్ ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ పరిశీలించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్న పొదుపు చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, అనవసర వ్యయాలను నియంత్రించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.