
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి శ్రీ కె.రఘురామకృష్ణరాజు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభా వ్యవహారాలను ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ, సనాతన ధర్మ పరిరక్షణకు మీ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నందుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.