కొత్తవలసలో ‘సూర్యాఘర్’ పథకం ప్రారంభం

సాలూరు నియోజకవర్గం: సాలూరు మండలం, కొత్తవలస గ్రామంలో సోమవారం ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టమ్‌లను ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం పేద కుటుంబాలపై ఉన్న విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడం అని పేర్కొన్నారు.

‘సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఘన స్వాగతం పలికి మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సోలార్ సిస్టమ్‌ల నిర్వహణ కోసం ప్రతి నెల మెంటెనెన్స్ చార్జ్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా కొత్తవలస గ్రామంలో 36 ఇళ్లకు ‘సూర్యాఘర్’ పథకం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సాలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2000 ఇళ్లకు ఈ పథకం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 10,000 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.