
ప్రత్తిపాడు: శంఖవరం గ్రామపంచాయతీకి సంబంధించిన డైలీ ఆశీలు వేలంపాటను వెంటనే నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో కొందరు వ్యక్తులు ఎటువంటి పంచాయతీ అనుమతులు లేకుండా డైలీ మార్కెట్‌లో ఆసీలు వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేయడం లేదని ఆరోపణలు చేశారు.
శంఖవరం గ్రామానికి చెందిన మేకల కృష్ణ, రేలంగి దొంగబాబు, పర్వత రామకృష్ణ, బొమ్మిడి చిట్టిబాబు, సూర్యారావు సోమవారం శంఖవరం మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి నాగలక్ష్మి మరియు ఎం.పి.డి.ఓ కార్యాలయ పరిపాలన అధికారిణి పుష్యామి కీర్తికి పిటిషన్ అందజేశారు.
ఈ సందర్భంగా మేకల కృష్ణ మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఆసీలు వేలంపాట నిర్వహించి పంచాయతీకి ఆదాయం సమకూర్చాలని కోరారు. వేలంపాట నిర్వహించకపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆసీలు వసూలు చేసి వ్యక్తిగత లాభం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.