
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో గురువారం సీతంపేట మండలం చిన్నబగ్గ గ్రామంలో పశు వైద్య శిబిరం మరియు మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐటీడీఏ ఆర్థిక సహకారంతో పశుసంవర్ధక శాఖ ద్వారా నిర్వహించబడింది.
కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ పవర్ స్వప్నిల్ హాజరై లబ్ధిదారులకు పాడి పశువులను పంపిణీ చేశారు. మొత్తం 460 పాడి పశువులు కొనుగోలు చేయగా, వాటి కోసం రూ.2,24,25,000 విలువైన చెక్కును కూడా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. పాడి పశువుల పంపిణీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.