
హైదరాబాద్: జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై ఆకర్షితులై, కేరళ రాష్ట్రం నుండి పలు రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు జనసేనలో చేరారు.
ఈ చేరికలలో పి. రామ్ సాగర్ (నేషనల్ లేబర్ పార్టీ – అట్టింగల్), కె. ధన సీలన్ (బీజేపీ – అట్టింగల్), బెస్సీ థామస్ (లోక్ జనశక్తి పార్టీ – త్రిశూర్), దిలీప్ కుమార్ (లోక్ జనశక్తి పార్టీ – తిరువనంతపురం), కె.ఎన్. అంబేద్కర్ (హిందుస్తాన్ అవామీ మోర్చా – కొచ్చి), రైసుద్దీన్ (రాష్ట్రీయ లోక్ దళ్ – మలప్పురం), జోషి అతోలి (రాష్ట్రీయ లోక్ దళ్ – కాలికట్), అనిల్ నాయర్ (కాంగ్రెస్ – వయనాడ్), మోహన్ దాస్ పనికర్ (కాంగ్రెస్ – త్రిశూర్), సునీల్ మలప్పురం (లోక్ జనశక్తి పార్టీ – మలప్పురం), సౌమ్య ఉన్నికృష్ణన్ (హిందుస్తాన్ అవామీ మోర్చా – ఎర్నాకులం), ఆడమ్ మాలిక్ (ఆల్ ఇండియా ముస్లిం లీగ్ – మలప్పురం), బిజు (లోక్ జనశక్తి పార్టీ – కాలికట్), బిందు (బీజేపీ – కొల్లం), టోమ్ (రాష్ట్రీయ లోక్ దళ్ – త్రిశూర్) పాల్గొన్నారు.
ఈ చేరికలు రాష్ట్రాల సరిహద్దులు లేని విలువలతో కూడిన రాజకీయాలను, జాతీయవాద భావజాలాన్ని మరొకసారి నిరూపించాయి. కార్యక్రమంలో తెలంగాణ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా. మాధవరెడ్డి కొత్తగా చేరిన నాయకులకు స్వాగతం పలికారు.
ఈ సంఘటన ద్వారా జనసేన పార్టీ ప్రభావం కేరళలో కూడా విస్తరిస్తోందని చెప్పవచ్చు.