నెల్లూరులో ఘనంగా మహారుద్రాభిషేకం.. సనాతన ధర్మ పరిరక్షణకు విశిష్ట సేవలు

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ తొలి వీధిలో భువనగిరి సుబ్బయ్య ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహారుద్రాభిషేకం, చండీయాగం, లలితా సహస్రనామ పారాయణం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఆచార సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 2,000 మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనసేన నాయకుడు కిషోర్ గునుకుల మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా మహారుద్రాభిషేకం, చండీయాగం నిర్వహిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న భువనగిరి సుబ్బయ్యతో పాటు కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఏఎంసీ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్ నరహరి, హేమచంద్ర యాదవ్, బాలు, కార్తీక్, చెంగయ్య, ప్రవల్లిక, లత, భవాని, అశోక్, సాయి, రాజు, రవి తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.