నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరు: బాలయ్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఘనవిజయం సాధించడంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన విజయ్‌కు అభినందనలు తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నటుడు రాజకీయాల్లోకి అడుగుపెడితే చరిత్రను మార్చగలడని, తమిళనాడులో ఎం.జి. రామచంద్రన్, తెలుగునాట నందమూరి తారకరామారావు నిరూపించారని గుర్తుచేశారు. అదే తరహా ప్రభంజనాన్ని విజయ్ మళ్లీ సృష్టించారని పేర్కొన్నారు. తమిళ ప్రజలు విజయ్‌పై ఉంచిన ఆశలను నెరవేర్చేలా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విజయం సాధించిన బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు కూడా బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.