
అమలాపురం: అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు అన్ని డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి తెలిపారు.
వినియోగదారులు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేదా అత్యవసర సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే స్పందన పొందేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించవచ్చని సూచించారు. అలాగే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్ 9440904477 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అమలాపురం డివిజన్‌కు 9490610101, రామచంద్రపురం డివిజన్‌కు 9490610098 నంబర్లు నిరంతరం సేవలో ఉంటాయని చెప్పారు.
ఈ చర్యల ద్వారా వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం ఉన్నప్పటికీ వినియోగదారులకు నిరంతర, సురక్షిత విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.