ఉమామహేశ్వరంలో రైతులకు శాశ్వత భూ హక్కులు – రైతువారి పట్టాల పంపిణీ

తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం, ఉమామహేశ్వరం (ఇనాం గ్రామం)లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ అర్హులైన రైతులకు రైతువారి పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83.64 ఎకరాల ఇనాం భూములపై రైతువారి పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ఎంపిక చేసి పట్టాలు జారీ చేసినట్లు చెప్పారు. త్వరలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి రైతుకు తప్పులులేని రికార్డులు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

తాడేపల్లి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులను గుర్తించి పట్టాలు అందజేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ పట్టాల ద్వారా రైతులకు భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయని, తద్వారా బ్యాంకు రుణాలు, పంట పెట్టుబడి సాయం వంటి ప్రభుత్వ పథకాలు సులభంగా పొందగలరని వివరించారు. అలాగే గ్రామ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద రూ.1.96 లక్షలు అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముందుగా గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోలాటం ఆడి అందరిని ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ సిబ్బంది,

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.